మంత్రుల రాజీనామా నేడు ఆమోదం
ఏపీ మంత్రుల రాజీనామాలు గవర్నర్ వద్దకు చేరుకున్నాయి. ఈరోజు గవర్నర్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లోని మంత్రుల రాజీనామాలు గవర్నర్ వద్దకు చేరుకున్నాయి. ఈరోజు గవర్నర్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. ఈరోజు రాజీనామాతో మంత్రి పదవులు ఖాళీ అయినట్లు గెజిట్ విడుదల చేయనున్నారు. ఈ నెల 11 వరకూ జగన్ ఒక్కరే కేబినెట్ లో ఉండనున్నారు. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది. అందుకు వీలుగా 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించనున్నారు.
అన్నీ వెనక్కు.....
మంత్రుల పేషీలకు సంబంధించి ఉన్న బోర్డులను కూడా నేడు తొలగించనున్నారు. సాధారణ పరిపాలన శాఖ మంత్రుల ఛాంబర్లను తమ అధీనంలోకి తీసుకోనుంది. మంత్రులకు ఇచ్చిన వాహనాలను కూడా ప్రొటోకాల్ అధికారులు వెనక్కు తీసుకోనున్నారు. కొత్త మంత్రుల ఛాంబర్లకు సంబంధించి క్లారిటీ వచ్చేంత వరకూ వాటిని సాధారణ పరిపాలన శాఖ తమ అధీనంలో ఉంచుకోనుంది.