రాజధాని టవర్లు.. ముందడుగు పడింది
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి 3,673.43 కోట్ల రూపాయలతో ఎల్-1 బిడ్డర్లకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీని ఆమోదిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల అప్పగింతకు సంబంధించి సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఇప్పటికే ఆమోదం తెలిపింది. 882.47 కోట్ల రూపాయలతో జీఏడీ టవర్ నిర్మాణ పనులను ఎన్‌సీసీ లిమిటెడ్‌కు, 1,487.11 కోట్ల రూపాయలతో టవర్స్-1, 2 పనులు షాపూర్జీ అండ్ పల్లోంజీ సంస్థకు, 1,303.85 కోట్ల రూపాయలతో టవర్స్- 3, 4 పనులను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అనుసరిస్తూ నిర్మాణ పనులు చేపట్టాలని ఆయా సంస్థలకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సూచించారు. నిబంధనలు అతిక్రమించినా, కార్మికుల భద్రత విషయంలో లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.