Midhun Reddy : నేడు న్యాయమూర్తి ఎదుటకు మిధున్ రెడ్డి
రాజంపేట్ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డిని నేడు న్యాయమూర్తి ఎదుట సిట్ అధికారులు ప్రవేశపెట్టే అవకాశముంది
రాజంపేట్ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డిని నేడు న్యాయమూర్తి ఎదుట సిట్ అధికారులు ప్రవేశపెట్టే అవకాశముంది. నిన్న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిన్న విచారించిన అనంతరం మిధున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుతెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు.
వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం...
విచారణకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఈరోజు మిధున్ రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశముంది. ఈరోజు ఆదివారం న్యాయస్థానాలకు సెలవులు కావడంతో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి ఆయన నిర్ణయం మేరకు రిమాండ్ కు తరలించే అవకాశాలున్నాయి. మద్యం కేసులో మిధున్ రెడ్డి ఎ4 నిందితుడిగా ఉన్నారు.