కోర్టులో కంటతడిపెట్టుకున్న రాజ్ కేసిరెడ్డి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఫాం హౌస్ లో దొరికిన నగదుకు తనకు సంబంధం లేదని, కావాలని తనపై ఆరోపణలు చేస్తన్నారని అన్నారు. వెంటనే న్యాయస్థానం ఆ దొరికిన కరెన్సీ నోట్ల నెంబర్లను నోట్ చేయాలని కూడా రాజ్ కేసిరెడ్డి చెప్పారు. విజయవాడ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడి పెట్టుకన్నారు.
నెంబర్లు నోట్ చేయాలంటూ...
తనది కాని డబ్బును తనదేనంటూ సిట్ అధికారులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనకు సంబంధం లేకపోయినా తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ తనకు బెయిల్ రాకుండా చేసేందుకు సిట్ అధికారులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైన ఆరోపణలకు దిగుతున్నారని కూడా రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. దీంతో న్యాయమూర్తి వెంటనే ఆ నోట్లకు సంబంధించి వీడియోలు, ఫొటోలు తీయాలని సిట్ అధికారులను ఆదేశించారు.