హైస్పీడ్ రైల్.. పట్టాలెక్కెదెప్పుుడు?

హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాలుగు గంటల్లోనే చేరుకునేలా ఓ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై రైల్వే శాఖ అధ్యయనం చేస్తుంది

Update: 2023-03-16 03:47 GMT

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాలుగు గంటల్లోనే చేరుకునేలా ఓ హైస్పీడ్ రైలు కారిడార్‌ ప్రాజెక్టుపై రైల్వే శాఖ అధ్యయనం చేస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌లో రెండు మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖ కాగా, రెండోది కర్నూలు-విజయవాడ. ఈ మార్గాల్లో గరిష్ఠ వేగం 220 కిలోమీటర్లు. ఒకటి రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ఇంజినీరింగ్, ట్రాఫిక్ స్టడీ (పెట్) సర్వే మరో రెండు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

హైదరాబాద్ టు విశాఖ....
220 కిలో మీటర్ల వేగంతో రైళ్లను నడపాలని రైల్వే శాఖ యోచిస్తుంది. ఇందుకు సంబంధించి టెండర్లు కూడా ఆహ్వానించింది. వాటి నుంచి అధ్యయనం కోసం ఓ సంస్థను కూడా ఎంపిక చేసినట్లు తెలియవచ్చింది. రైల్వే కారిడార్ వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గం ద్వారా ఏర్పాటు చేయాలా? నల్లగొండ, గుంటూరు మీదుగా నడపాలా? అన్నది అధ్యయనం తర్వాతనే తెలుస్తుంది. ఈ రైలు పట్టాలెక్కితే మాత్రం నాలుగు గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. ఇప్పుడు పన్నెండు గంటల పట్టే సమయం నాలుగు గంటల తగ్గడమంటే ప్రయాణికులకు గొప్ప రిలీఫ్ అని చెప్పాల్సి ఉంటుంది.


Tags:    

Similar News