మూడు రాజధానులు సరికాదు : రాహుల్

ఏపీకి ఒక రాజధాని మాత్రమే ఉండాలని, మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

Update: 2022-10-19 08:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారత్ జోడో యాత్రకు మంచి స్పందన కనిపిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదోని లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ఒక రాజధాని మాత్రమే ఉండాలని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని రాహుల్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ఇచ్చిన విభజన హామీలను అమలు పరుస్తామని తెలిపారు.

విభజన హామీలు...
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజల వైఖరి మారుతుందన్నారు. పాదయాత్రకు కనిపిస్తున్న స్పందన చూస్తుంటేనే అది అర్థమవుతుందన్నారు. వైసీపీ మద్దతు తీసుకునే విషయంలో తాను నిర్ణయం తీసుకోలేని, పార్టీ అధ్యక్షుడిదే తుది నిర్ణయమని ఆయన తెలిపారు. ఖర్గే, శశిధరూర్ లు అనుభవజ్ఞులని, వారికి తన సలహాలు అవసరం లేదని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల జలవివాదాల పరిష్కారం చూపేందుకు యంత్రాంగం ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
ఆర్థిక వ్యవస్థను...
దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ విధానాలను నాశనం చేశాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు కరవుయ్యారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. జీఎస్టీ వల్ల ప్రజలపై భారం మరింత పడిందన్నారు. బలవంతంగా పన్నులను రుద్దిందన్నారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ లో తప్ప ఏ పార్టీలోనూ బహిరంగంగా నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయరన్నారు. గతంలో జరిగిన రాష్ట్ర విభజన గురించి కాకుండా భవిష్యత్ గురించి ఆలోచించాలని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News