Ys Jagan : భూముల రీసర్వే పై చంద్రబాబు క్రెడిట్ చోరీ

భూముల రీసర్వే పై కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

Update: 2026-01-22 06:22 GMT

భూముల రీసర్వే పై కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు భూముల రీ సర్వే చేయాలన్న కనీస ఆలోచన ఎప్పుడైనా గతంలో వచ్చిందా? అని జగన్ ప్రశ్నించారు. ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రీ సర్వే చేయించాలన్న ఆలోచన ఎందుకు చేయడం లేదని ఆయన నిలదీశారు.

తన పాదయాత్రలో...
భూముల రీ సర్వే కు 2019 కంటే ముందు 3,645 కిలోమీటర్ల పాదయాత్రలో రైతన్నలు పడుతున్న అవస్థలు చూసిన తర్వాత, వారు లేవనెత్తిన సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ భూముల రీసర్వే అని జగన్ తెలిపారు. నాడు సర్వే చేయడానికి అవసరమైన సిబ్బంది లేవని, పరికరాలు లేవని, భూముల క్రయవిక్రయాలు జరపాలన్నా, కుటుంబ సభ్యుల మధ్య పంపకాలు జరపాలన్నా వీలుండేది కాదన్నారు. 2019 మ్యానిఫేస్టోలనే తాము భూముల రీ సర్వే చేస్తామని పెట్టామని తెలిపారు.
వివాదాలు లేకుండా...
నాటికి సర్వే చేయడానికి అవసరమైన పరికరాలు కూడా లేవని జగన్ తెలిపారు. సరైన టెక్నాలజీ కూడా లేదన్నారు. భూ వివాదాలు లేకుండా చేయాలనే నాడు తమ ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే చేయాలని నిర్ణయించామని చెప్పారు. ట్యాంపరింగ్ చేయలేని విధంగా రైతులకు భూ పత్రాలను అందచేశామని తెలిపారు. టాంపరింగ్ చేయలేని విధంగా పత్రాలను రూపొందించాలని తాను అధికారులను ఆదేశించినట్లు జగన్ తెలిపారు. 2020 డిసెంబరులో భూముల రీ సర్వే ప్రారంభించామని జగన్ చెప్పారు. చంద్రబాబు ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని జగన్ అన్నారు.








Tags:    

Similar News