ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది

Update: 2026-01-22 04:19 GMT

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పందిరిమామిడి గూడెం ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయపడిపోతున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి పెద్దపులి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పెద్దపులి సంచారం ఉందని తెలియడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఎవరూ వెళ్లవద్దంటూ...
ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో పెద్దపులి అడుగులను కూడా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్దపులి ఎక్కడకు వెళ్లిందని తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలను అమర్చారు. ప్రజలు తమ పెంపుడు జంతువులను కూడా కాపాడుకోవాలని, బయటకు వదలిపెట్టవద్దని అటవీ శాఖ అధికారులు కోరారు.


Tags:    

Similar News