జగన్ పై మంత్రి గొట్టిపాటి ధ్వజం

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2026-01-22 04:31 GMT

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యారెక్టర్ లేని జగన్ క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్ ఏం చేశాడని క్రెడిట్ ఇవ్వాలని ప్రశ్నించారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంలోనే జగన్ కు క్రెడిట్ ఇవ్వాలని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ శాఖను సర్వనాశనం చేసినందుకు జగన్ రెడ్డికి కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందేనని తెలిపారు.

ఎందుకివ్వాలి క్రెడిట్...
ముప్ఫయి వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసినందుకు జగన్ క్రెడిట్ ఇవ్వాలా? అని ఎద్దేవా చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచినందుకు జగన్ రెడ్డికి క్రెడిట్ ఇవ్వాలని, పీపీఏలను రద్దు చేసినందుకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలని సెటైర్ గొట్టిపాటి రవికుమార్ వేశారు. మళ్లీ ఏ మోహం పెట్టుకుని జగనే ఉండి ఉంటే ని మాట్లాడుతున్నావ్? అని నిలదీశారు. నువ్వు ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారేది, విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యేదని, రాష్ట్రాన్ని చోరీ చేసిన నువ్వు... క్రెడిట్ చోరీ గురించి మాట్లాడితే జనం నవ్వుతున్నారంటూ ధ్వజమెత్తారు.


Tags:    

Similar News