YRCP : నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
వైసీపీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది
వైసీపీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నిర్ణయించనున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సమస్యలను ఉభయ సభల్లో ప్రస్తావించాలని వైసీపీ సభ్యులకు వైఎస్ జగన్ సూచించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సభలో ప్రస్తావించాలని చెప్పనున్నారు.
ఉభయ సభల్లో...
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ అంశాన్ని కూడా ఉభయ సభల్లో ప్రస్తావించాలని పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావించాలని సూచించనున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు జగన్ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.