Chandrababu : నేటితో ముగియనున్న చంద్రబాబు దావోస్ పర్యటన

నేటితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ముగియనుంది

Update: 2026-01-22 03:01 GMT

నేటితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ముగియనుంది. గత మూడు రోజుల నుంచి దావోస్ లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు దాదాపు 36 సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ పారిశ్రామికేవేత్తలతో సమావేశమయి ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను గురించి వివరించారు. కొన్ని పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

రేపు హైదరాబాద్ కు...
మరికొన్ని సంస్థలు అవగాహన ఒప్పందాలు ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్నాయి. దీంతో నేటితో చంద్రబాబు దావోస్ పర్యటన పూర్తి కానుంది. ఈరోజుసాయంత్రం 6:30కు జ్యూరిచ్ నుంచి బయదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 8:30కు హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి ఆయన బయలుదేరి వెళతారు.


Tags:    

Similar News