Narendra Modi : అమరావతికి నేడు మోదీ రాక
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అమరావతికి రానున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అమరావతికి రానున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు ఐదు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి పార్టీలు చుట్టుపక్కల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనాలను సమీకరిస్తున్నారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు...
ఈరోజు దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. శాశ్వత హైకోర్టు, సచివాలయంతో పాటు అసెంబ్లీ భవనాలను, న్యాయమూర్తుల నివాస భవనాలు, ఎమ్మెల్యులు, మంత్రులు, ఐఏఎస్ క్వార్టర్స్ కు మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో పాటు పలు రోడ్లు, రైలు, కేంద్ర ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. మోదీ సభకు మొత్తం మూడు వేదికలను నిర్మించారు. ఇందుకోసం పదకొండు చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.