Narendra Modi : అమరావతి సభపై మోదీ ట్వీట్
అమరావతి పునఃప్రారంభంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు
అమరావతి పునఃప్రారంభంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “చారిత్రక అధ్యాయం ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. నిన్న అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన మోదీ ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఈ ట్వీట్ చేశారు. తనకు ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.
గొప్ప నగరంగా...
“అమరావతి ఏపీ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుంది”. “గొప్ప నగరంగా అవతరిస్తుందన్న నమ్మకం ఉంది”. “అమరావతి, ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ప్రశంసనీయం” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మోదీ సభకు దాదాపు ఐదు లక్షల మంది రావడంతో ఆయన పూర్తిగా సంతోషంగా ఉన్నట్లు కనపడింది.