పవన్ కల్యాణ్ ను తన వద్దకు పిలిపించుకుని మరీ చేతిలో చేయివేసి?

ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడయినా పవన్ కల్యాణ్ పట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతారు

Update: 2025-05-02 12:50 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడయినా పవన్ కల్యాణ్ పట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతారు. ఎక్కడ కనిపించినా ఆప్యాయతతో పలకరిస్తారు. అంతేకాదు పవన్ కల్యాణ్ తన ప్రసంగాలలో ప్రశంసలతో ముంచెత్తుతారు. హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సభలోనూ పవన్ కల్యాణ్ దగ్గర ఆగి మరీ పలకరించిన మోదీ ప్రత్యేకంగా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వచ్చిన సమయంలోనూ పవన్ కల్యాణ్ తో పాటు చిరంజీవితో కలసి ప్రత్యేకంగా ఫొటో దిగారు.

చాక్లెట్ ఇచ్చి...
ఇప్పుడు రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభలోనూ పవన్ కల్యాణ్ తన సోదరుడంటూ ప్రస్తావించారు. తన ప్రసంగంలో అనేక సార్లు పవన్ కల్యాణ్ పేరు మరీ ప్రస్తావించి పవన్ పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటు కున్నారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ ను తన దగ్గరకు పిలిచి చేతిలో ఏదో పెట్టి నవ్వులు పూయించారు. అయితే పవన్ కల్యాణ్ ను దగ్గరకు పిలిచి చాక్లెట్ ఇచ్చిన ప్రధాని మోదీ పవన్ తో కాసేపు ముచ్చటించారు. దీంతో పవన్ కల్యాణ్ చేతికి చాక్లెట్ ఇవ్వడంతో అక్కడే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నవ్వడం కనిపించింది.


Tags:    

Similar News