ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేత : ప్రకటించిన మంత్రి పెద్దిరెడ్డి

పవర్ హాలిడేల నుంచి కాస్త ఊరటనిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు ఇచ్చిన రెండ్రోజుల పవర్ హాలిడే..

Update: 2022-05-10 10:01 GMT

అమరావతి : ఏపీలో విద్యుత్ కొరత నేపథ్యంలో ఇటీవల పరిశ్రమలకు రెండురోజులు పవర్ హాలిడేలు ప్రకటించిన విషయం తెలిసిందే. పవర్ హాలిడేల నుంచి కాస్త ఊరటనిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు ఇచ్చిన రెండ్రోజుల పవర్ హాలిడేల్లో ఒకరోజు హాలిడేను ఎత్తివేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అలాగే ఆయా కేటగిరీలకు చెందిన పరిశ్రమలకు విధించిన విద్యుత్ పరిమితులను కూడా సడలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

గత రెండునెలల్లో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గిందన్న పెద్దిరెడ్డి.. పరిశ్రమలకు మరింత విద్యుత్ ను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉపయోగిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇకపై అన్ని రకాల పరిశ్రమలకు 70 శాతం, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీలకు 100 శాతం విద్యుత్ ను అందించనున్నట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు.


Tags:    

Similar News