నేడు కోర్టుకు చేబ్రోలు కిరణ్
టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను నేడు కోర్టులో పోలీసులు హాజరు పర్చనున్నారు
టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను నేడు కోర్టులో పోలీసులు హాజరు పర్చనున్నారు. నిన్న అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు చేబ్రోలు పోలీసులు విచారించారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేయాలని టీడీపీ అధినాయకత్వం ఆదేశించడంతో టీడీపీ గుంటూరు నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిన్న అరెస్ట్ చేసి...
నిన్న సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చేబ్రోలు కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతితో పాటు మాజీ మంత్రి విడదల రజనీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు చేబ్రోలు కిరణ్ ను గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు.