కాకాణి కోసం ఏడు బృందాలు

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం ఏడు బృందాలు కాకాణి కోసం గాలిస్తున్నాయి.

Update: 2025-04-11 03:45 GMT

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం ఏడు బృందాలు కాకాణి కోసం గాలిస్తున్నాయి. గత పన్నెండు రోజులుగా కాకాణి గోవర్థన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. హైకోర్టులో కూడా ఆయనకు ముందస్తు బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

పన్నెండు రోజులుగా...
ఈ నేపథ్యంలో కాకాణి గోవర్థన్ రెడ్డి తప్పించుకుతిరుగుతుండటంతో నెల్లూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలకు వెళ్లిన పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. కాకాణి గోవర్థన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. ఎస్టీ, ఎస్టీ కేసు కూడా నమోదయింది. విచారణకు హాజరు కాకుండా ఉన్న కాకాణిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


Tags:    

Similar News