ప్రసన్నకు నోటీసులు జారీ
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు విచారణకు రావాలని కోరారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు.
ఈ నెల25న విచారణకు...
ఈ నెల 25వ తేదీన విచారణకు కోవూరు సర్కిల్ కార్యాలయానికి రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డ ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనతో పాటు తన కటుంబాన్ని బాధించాయని, ప్రతిష్టను దెబ్బతీశాయని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొనడంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు జారీ చేశారు.