Andhra Pradesh : జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు నిషిద్ధం
ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు
ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరే గింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.
బాణసంచా కాల్చినా.. విక్రయించినా...
జూన్ నాలుగో తేదీన టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎవరీనీ ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. . శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.