కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం?

వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు.

Update: 2025-04-04 02:59 GMT

వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయన కోసం నెల్లూరు, హైదరాబాద్ లో ని ఆయన ఇళ్లకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. అయితే అక్కడ కాకాణి లేకపోవడంతో బుధవారం మరోసారి నోటీసులను కాకాణి కుటుంబ సభ్యులకు ఇచ్చి వచ్చారు.

నేడు విచారణ...
గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా కాకాణి గోవర్థన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. దీంతో పాటు కాకాణి గోవర్థన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ అనంతరం వచ్చే తీర్పును అనుసరించి కాకాణి గోవర్థన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News