తాడిపత్రి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్?
తాడిపత్రికి బయలుదేరేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బయలుదేరుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు
తాడిపత్రికి బయలుదేరేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బయలుదేరుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లికి భారీగా పోలీసులు చేరుకున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని వెళ్తానన్నా పోలీసులు అనుమతించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాడిపత్రికి వస్తే...
తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని భావించి పోలీసులు ముందుగానే ఆయన పర్యటనను అడ్డుకుంటున్నారు. మరోవైపుఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి చెబుతున్నారు. అటు తిమ్మంపల్లి, ఇటు తాడిపత్రిలోనూ భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.