Perni Nani : చంద్రబాబు చేతులో అమరావతి రైతులు మోసపోయారు
అమరావతి రైతులు ఇప్పుడు జగనే నయమని భావిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు
అమరావతి రైతులు ఇప్పుడు జగనే నయమని భావిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబును నమ్మి రైతుల మోసపోయారన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తులను ప్రలోభాలకు గురిచేయడంలో దిట్ట చంద్రబాబు అని అన్నారు. అనైతిక రాజకీయాలు చేయడంలోనూ చంద్రబాబును మించిన వారు మరెవ్వరూ లేరని అన్నారు. రాజకీయాల్లో విలువలు లేని నేతలు ఎవరైనా ఉన్నారంటే అందులో చంద్రబాబు ఒకరని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తనపై నమోదయిన కేసుల నుంచి తప్పించుకోవడానికి ఫిర్యాదు దారులను బెదిరించి కేసులను కొట్టివేయించుకుంటున్నారని అన్నారు.
పరిశ్రమలు లేకుంటే ఎవరు కొంటారు?
హెల్త్ గ్రౌండ్స్ తో తనపై ఉన్న కేసుల్లో బెయిల్ తెచ్చుకుని కనీసం ఆసుపత్రికి కూడా వెళ్లకుండా ఉన్నది చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్సీలను బెదిరించివారి చేత రాజీనామాలు చేయిస్తున్నారని పేర్ని నాని అన్నారు. ప్రజల సొమ్ము ఖర్చు చేయకుండా పవన్ కల్యాణ్, లోకేశ్ హెలికాపర్ట్ లలో తిరుగుతున్నారని, మరి ఆ డబ్బు ఎవరిదని పేర్ని నాని ప్రశ్నించారు. అమరావతిని చంపేస్తుంది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. అమరావతిలో పరిశ్రమలకు రాకపోతే ఇక ఇక్కడ జనం ఎవరుంటారని, రైతులకు ఇచ్చిన స్థలాలను ఎవరు కొంటారని పేర్ని నాని ప్రశ్నించారు.