ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిమ్మల ఏమన్నారంటే?

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు

Update: 2026-02-27 05:38 GMT

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు బడ్జెట్ కేటాయింపులపై శాసనసభలోమంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం చెప్పారు. నాడు 2014-19లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. 63.20 టిఎంసిల నీటితో 8లక్షల ఎకరాలకు సాగు నీరు, 30లక్షల మంది ప్రజలకు తాగు నీటితో పాటు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా రూపొందించారన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకంను ఫేజ్-1లో 2022 కోట్లు, ఫేజ్-2 లో 4210 తో పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

ప్రాజెక్టకు నిధులు...
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాధాన్యతను గుర్తించి కూటమి ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్ళేలా శ్రద్దపెట్టామని, ఈ బడ్జెట్ లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల కోసం 500 కోట్లు, భూసేకరణకు 100 కోట్లు, మొత్తం 600 కోట్లు కేటాయించామని చెప్పారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులన ప్రాధాన్యతగా గుర్తించి 460 కోట్లు కేటాయించామని, ఉత్తరాంధ్రను సస్యశ్యామలం అవ్వాలంటే పోలవరం ఎడమ ప్రధాన కాలువ కీలకంగా మారనుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2014-19 లో చేసిన పనులు తప్ప, గత 5ఏళ్ళ వైసిపి పాలనలో ఒక్కరూపాయి ఖర్చు గానీ, తట్ట మట్టి గానీ,అరబస్తా సిమెంట్ పని గానీ చేయలేదని, గత వైసిపి ప్రభుత్వంలో 63 కోట్లు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటే 1209 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశామని తెలిపారు. 2026 జూన్ నాటికి సిఎం చంద్రబాబు చేతుల మీదుగా అనకాపల్లి వరకు నీళ్ళు తీసుకెళ్ళేలా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు చేస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News