YSRCP : పెద్దిరెడ్డి గాయబ్.. జగన్ కు దూరం జరగడానికి కారణమేంటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకం

Update: 2026-02-21 09:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఫ్యామిలీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డిలు జగన్ కు ఒకరకంగా చెప్పాలంటే.. ముఖ్యమైన వారు. బంధుగణం కంటే ఎక్కువగానే పార్టీ నేతలు చెబుతారు. అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికుటుంబం గత కొన్ని నెలల నుంచి సెలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. వరస కేసులు పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఇబ్బందిపెట్టాయనే చెప్పాలి. అందుకే ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ పరిణామంపైన కూడా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు స్పందించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే .. కొంత కాలం మౌనంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులున్నట్లు తెలుస్తోంది.

ముగ్గురున్నప్పటికీ...
పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో రెండు శాసనసభ నియోజకవర్గాలు మాత్రమే వైసీపీకి దక్కాయి. పార్లమెంటు నియోజకవర్గాల్లో వచ్చిన మూడు స్థానాల్లో ఒకటి రాజంపేట మాత్రమే. అలా పాతుకుపోయిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూటమి సర్కార్ లక్ష్యంగా చేసుకుందన్న అభిప్రాయం బలపడిన వెంటనే వారు మౌనంగా ఉండిపోయారు. అక్రమ మద్యం కేసులో మిధున్ రెడ్డి దాదాపు నలభై ఐదు రోజుల పాటు జైలులో ఉన్నారు. తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. తర్వాత అటవీ భూముల ఆక్రమణ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపు కూటమి నేతలు వేళ్లు చూపించారు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెలికాప్టర్లో వెళ్లి ఆక్రమణలను చిత్రీకరించారు.
నాన్చుడు ధోరణి అంటూ...
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కూటమి సర్కార్ నానుస్తుందంటూ ఆ పార్టీ నేతలు, క్యాడర్ కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ పెద్ది రెడ్డి కుటుంబం న్యాయస్థానాలకు వెళ్లి తమపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన రక్షణలను తెచ్చుకుంది. పవన్ కల్యాణ్ బయటపెట్టిన వీడియోతో దాదాపు 74 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించుకుందన్న ఆరోపణలు వినిపించి నెలలు గడుస్తున్నా యాక్షన్ ఎక్కడ అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ అందుకు సరైన ఆధారాలుటేనే కదా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ తలనొప్పి ఎందుకన్న ధోరణితోనే రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాల గురించి ఆయన ప్రస్తావన చేయక పోవడం ఇందుకు అద్దం పడుతుంది.




Tags:    

Similar News