జగన్ “మావిగన్ జోకర్” : వైఎస్ షర్మిల
వైఎస్ జగన్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు
వైఎస్ జగన్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.మూడు రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్నారని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వారసులం అని చెప్పుకునే జగన్ వైఎస్సార్ పేరును వాడుకున్నారు తప్పిస్తే.. ఆయన ఆశయాలకు వారసులు కాలేదన్నారు.వైసీపీలో నిజంగా వైఎస్సార్ ఐడియాలజీ ఉంటే ..జగన్ ముఖ్యమంత్రి అయి వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
వైఎస్ వ్యతిరేకించిన...
వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీ కి దత్తపుత్రుడుగా ఎందుకు మారారని, దళితులపై, క్రిస్టియన్లపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఎందుకున్నారని నిలదీశారు. వైఎస్సార్ ప్రజాప్రస్థానం పాదయాత్రకు నేటికి 23 ఏళ్లయిందని, వైఎస్సార్ ఐడియాలజీ కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. - కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకమని షర్మిల అన్నారు.