మీడియా సమావేశంలో కంట తడిపెట్టిన బొత్స

వైఎస్సార్ గురించి మాట్లాడుతూ సీనియన్ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికిలోనయ్యారు

Update: 2026-04-09 12:01 GMT

వైఎస్సార్ గురించి మాట్లాడుతూ సీనియన్ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికిలోనయ్యారు. ఆయన మీడియా సమావేశంలో కంటతడిపెట్టారు. వైఎస్సార్ వల్లనే కాంగ్రెస్ బతికి బట్టకలిగిందన్నారు. వైఎస్సార్ మరణించారని తనకు చెప్పారని ప్రచారం చేస్తున్నావా? అనిప్రశ్నించారు. ఇచ్చిన పదవికి న్యాయం చేయలేక అసత్య ప్రచారం చేస్తావా? అని ప్రశ్నించారు.

అహంభావంతో అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు అహంభావంతో మాట్లాడుతున్నారన్నారు. పార్టీ లేదు బొక్కా లేదన్నది ఎవరన్నదో మర్చిపోయారా? అని అన్నారు. అచ్చెన్నాయుడు ఆలోచనలు మోకాలు నుంచి కిందకు దిగి వస్తున్నాయన్నారు. మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతు న్నారన్నారు. రాజకీయాల్లో అందరూ నీలాగే ఉంటారని అనుకున్నావా? అని ప్రశ్నించారు. మావిగన్ అంటే అంత ఉలికిపాటు ఎందుకని బొత్స ప్రశ్నించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే ఇటువంటి ప్రచారాలకు దిగుతారా? అని నిలదీశారు.


Tags:    

Similar News