Tirumala : టీటీడీ మరొక అరుదైన రికార్డు

తిరుమల తిరుపతి దేవస్థానం మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

Update: 2026-04-09 07:22 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది అత్యధికంగా లడ్డూలను విక్రయించి రికార్డును బ్రేక్ చేసింది. 2025 -26 సంవత్సరంలో రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయాలు జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు.

లడ్డూల విక్రయాల్లో...
ఈ ఏడాది మొత్తం 13.95 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తులిపారు. 567 కోట్ల రూపాయల విలువైన లడ్డూలను విక్రయించినట్లు వెల్లడించారు. టీటీడీ చరిత్రలో ఇదొక రికార్డు అని, రోజుకు నాలుగు లక్షలు లడ్డూల విక్రయం జరిగినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News