Chandrababu : జగన్ ను అరెస్ట్ చేయడం నాకు నిమిషం పట్టదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీయిజం బ్యాచ్ , సైకో ప్రవర్తనలతో, వితండవాదాలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. సూరేపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏమీ అనకుండానే ఓ పత్రికపై దాడి చేస్తున్నారన్నారు. ఆడబిడ్డల్ని వేధించారని, ఇలాంటి ప్రవర్తనపై సమాధానం చెప్పే పరిస్థితి సైకో పార్టీకి లేదని చంద్రబాబు అన్నారు. ఇలాంటి తరహా వ్యక్తి రాజకీయ పార్టీ వెనుక లేకపోతే ఇంటి నుంచి బయటకు రాగలడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే మనం అంతా కలిసి కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇప్పటికే రాష్ట్రం విభజన వల్ల, గత పాలకుల వల్ల చాలా నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నామని, అడవుల్లో ఉండే ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్ళిపోతారని, ఇతను కూడా అంతే ఎక్కడో ఉండి దుష్ప్రచారం చేసి పారిపోతాడని చంద్రబాబు అన్నారు.