ఎవరిని విచారించాలో చెప్పండి.. వివేకాహత్య కేసులో సుప్రీంకోర్టు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది

Update: 2026-01-20 07:41 GMT

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీంలో సునీత సవాల్ చేసింది. తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తున్నారా?’ అని సీబీఐకి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ ఏ అంశాలపై విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది.

ఎవరిని కస్టడీలోకి తీసుకుని...
ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలనుకుంటున్నారో చెబితే పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ ఫిబ్రవరి ఐదో తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇటీవల సీబీఐ కోర్టు కొన్ని అంశాలకే ఈ హత్య కేసులో విచారణ చేయాలని ఆదేశించడంతో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


Tags:    

Similar News