Andhra Pradesh : రెండు కోట్ల ఆస్తి దానం చేసిన దంపతులు
తమకున్న ఆస్తి మొత్తాన్ని దేవుడికి దంపతులు విరాళమిచ్చారు.
తమకున్న ఆస్తి మొత్తాన్ని దేవుడికి దంపతులు విరాళమిచ్చారు. దాదాపు రెండు కోట్ల రూపాయల ఆస్తిని రాములోరికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ ఆస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు.
రాములోరి ఆలయానికి...
దాదాపు రెండు కోట్ల రూపాయల విలువగల ఆస్తిని ఆలయానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి ఇవ్వడంతో పలువురు అభినందిస్తున్నారు. తమకున్న యావదాస్తిని రాముల వారి ఆలయానికి దానం చేసిన దంపతులను పలువురు ప్రశంసిస్తున్నారు.