దావోస్ పర్యటన పొగడ్తలకేనా?
టీడీపీ నేతలకు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు.
టీడీపీ నేతలకు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. దావోస్ కు వెళ్లి వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రాష్ట్రానికి ఒరగపెట్టిందేమీ లేదని అన్నారు. గత రెండేళ్ల పాలనలో ఉచితంగా భూములు ఇవ్వకుండా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను అయినా తెచ్చారా? అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఎకరం 99 పైసలకు భూములిచ్చి రాష్ట్రానికి పరిశ్రమలను తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.
తప్పుడు ప్రచారం...
చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఒకరిపై ఒకరు పొగడ్తలను కురిపించుకోవడం కోసమే దావోస్ వెళ్లారని గుడివాడ అమర్నాథ్ అన్నారు. గతంలో తమకు దావోస్ నుంచి ఆహ్వానం అందిందన్న గుడివాడ అమర్నాథ్ తమకు ఆహ్వానం అందలేదని తప్పుడు ప్రచారం చేశారన్నారు. చలిగా ఉందని తాను వెళ్లలేదు అన్నట్టు దుష్ప్రచారం చేశారని, అలా అని తాను అన్నట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని చెప్పారు. ఈ క్షణమే రాజకీయాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానని గుడివాడ అమర్నాథ్ అన్నారు.