Pawan Kalyan : పవన్ ఫోకస్ అంతా దానిపైనే.. అందుకే ఆయన కనిపించరట

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎక్కువగా ప్రచారాన్ని కోరుకోరు. ఆయన తన పనిని తాను చేసుకుంటూ వెళతారు.

Update: 2025-10-30 08:03 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎక్కువగా ప్రచారాన్ని కోరుకోరు. ఆయన తన పనిని తాను చేసుకుంటూ వెళతారు. పవన్ కల్యాణ్ కేవలం ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రమే కాదు. పవర్ స్టార్ కూడా. ఆయన జనంలోకి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు. తమిళనాడులో టీవీకే విజయ్ పాల్గొన్న కరూర్ లో జరిగిన సభలో తొక్కిసలాట జరిగింది. పవన్ కల్యాణ్ తొలి నుంచి ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆయన రోడ్ షోల కంటే బహిరంగ సభలకే పరిమితమవుతారు. అంతే తప్ప జనంలోకి వెళితే ఏం జరుగుతుందన్నది ఆయనకు స్పష్టంగా తెలుసు. నేతలన్నాక జనం వద్దకు వెళ్లాలన్న అంశం పవన్ కల్యాణ్ విషయంలో సరిపోదన్నది వాస్తవం. కానీ ఈరోజు పవన్ కల్యాన్ అవనిగడ్డలో పర్యటంచి వరద బాధిత రైతులను పరామర్శించారు.

సమర్థంగా గ్రౌండ్ అయ్యేలా...
అందుకే విపత్తు జరిగిన సమయంలోనూ పవన్ కల్యాణ్ దూరంగా ఉండి తన శాఖ పనులతో పాటు ప్రభుత్వం తనకు నిర్దేశించిన పనులు సమర్థంగా గ్రౌండ్ అయ్యేలా చూస్తారు. ఆ మధ్య బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తినప్పుడు కూడా పవన్ కల్యాణ్ ముందుగా జనంలోకి రాకపోవడానికి అదే కారణం. తాను బాధితులను పరామర్శించడానికి వచ్చినా, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి బయలుదేరినా, వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు అక్కడకు వెళ్లినా అభిమానులు వెంటనే చుట్టుముడతారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అది తనను బాధిస్తుందని పవన్ కల్యాణ్ నమ్ముతారు. అందుకే పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చే విషయంలో ఇప్పుడూ.. ఎప్పుడూ దూరంగానే ఉంటారు.
తుపాను సమయంలో...
తాజాగా మొంథా తుపాను సమయంలోనూ తన కార్యాలయం నుంచి పవన్ కల్యాణ్ నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తు సమయంలో అగ్రభాగాన నిలిచే పంచాయతీరాజ్ అధికారులను అప్రమత్తం చేశారు. వారిని క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలకు అండగా నిలబడాలని ఆదేశించారు. ముఖ్యంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల బాగోగులను పవన్ కల్యాణ్ దగ్గరుండి అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ఇవన్నీ మీడియాలో పెద్దగా హైలెట్ కాకపోయినా ఆయనకు పరవాలేదు. పవన్ కు కావాల్సిన ఇమేజ్ కు చెక్కుచెదరదని ఆయన నమ్మకం. అందుకే పవన్ కల్యాణ్ మొంథా తుపాను సమయంలో తన పని తాను చేసుకుని వెళ్లారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని పదే పదే పవన్ అధికారులను ఆదేశించారు. చివరకు ముప్పు తప్పడంతో పవన్ తో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News