తిరుమలలో భక్తుల రష్.. దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి.

Update: 2022-10-01 03:26 GMT

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులందరికీ దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. భక్తులు సంయమనం పాటించాలని కోరుతున్నారు.

హుండీ ఆదాయం...
మరోవైపు నిన్న శ్రీవారిని 75,382 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,424 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.85 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గరుడ సేవకు ఐదు వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు. అన్ని హారతులను రద్దు చేశారు. అలిపిరి నుంచి ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు.


Tags:    

Similar News