తిరుమలలో రద్దీ ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

Update: 2023-03-21 02:42 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్టమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 🏿సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని తెలిపారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 62,824 మంది భక్తులు శ్రీవారిని దరశించుకున్నారు. వీరిలో 21,718 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.96 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.
మార్చి 23న ఆర్జితసేవా టికెట్లు....
తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి. అలాగే జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంట‌ల‌కు మొదలవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
అంగప్రదక్షిణం టోకెన్లు....
జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా కింద వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.


Tags:    

Similar News