Andhra Pradesh : నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు.. రోగుల అవస్థలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు చెల్లించాల్సిన బకాయీలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆసుపత్రులకు రావాల్సిన బకాయీలను చెల్లించకపోవడంతో వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ఓపీ నుంచి ఆపరేషన్ల వరకూ ఎన్టీఆర్ వైద్య సేవలను నిన్నటి నుంచి నిలిపివేశారు.
బకాయీలు చెల్లించేంత వరకూ...
తాము బకాయీలు చెల్లించేంత వరకూ సేవలను పునరుద్ధరించే ప్రసక్తి లేదని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం రూ.650 కోట్ల బకాయిలు విడుదల చేసేవరకు చర్చలకు వెళ్లకూడదని ఆస్పత్రుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులకు 2,700 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, అందుకే ఈ సేవలను నిలిపివేస్తున్నామని వారు ప్రకటించింది.