తిరుమలలో గంటలోనే శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. సాధారణంగానే ఉంది. బ్రహ్మోత్సవాలు ముగియడంతో తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య తగ్గింది.

Update: 2022-10-05 05:26 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. సాధారణంగానే ఉంది. బ్రహ్మోత్సవాలు ముగియడంతో తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య తగ్గింది. ఈరోజు విజయదశమి కారణంతోనూ భక్తుల రద్దీ అంతగా లేదు. కేవలం గంటలోనే స్వామి వారి దర్శనం పూర్తవుతుంది. ఈరోజు బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిన 66,539 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,177 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.90 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News