ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ నూతన కమిటీ

ఏకగ్రీవంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికయింది.ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఎన్నికయ్యారు

Update: 2025-08-16 07:58 GMT

విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికయింది. అధ్యక్షుడిగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని, కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఎన్నికయినట్లు సమావేశం ఏకగ్రీవంగా ప్రకటించింది.

34 మందితో...
మరో ముప్ఫయి నాలుగు మందితో ఏసీఏ నూతన కమిటీ ఎన్నికయిందని తెలిసింది. మూడేళ్ల కాల పరమతితో నూతనంగా ఎన్నికలైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ పనిచేయనుంది. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయనున్న ప్రకటించింది. ఈ సందర్భంగా నూతన కమిటీ భవిష్యత్తులో చేపట్టనున్న పనులు స్టేడియాల నిర్మాణం టోర్నమెంట్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించింది.


Tags:    

Similar News