నెల్లూరుకు వెళ్లే వారికి హై అలెర్ట్.. వెళ్లొద్దండీ
దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి
దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నెల్లూరు సిటీలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. 21.4 సెంటీమీటర్ల మేరకు వర్షం కురిసింది. రైల్వే అండర్పాస్లు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
భారీ వర్షాలతో...
ఉన్న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల్లోని వాయుగుండం (దిత్వా అవశేషం) తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిని తెలిపింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.