పవన్ కల్యాణ్ తో మోదీ వేసిన జోకులేంటంటే?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో ప్రధాని నరేంద్ర మోదీ సరదాగా సంభాషించారు

Update: 2025-02-20 07:23 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో ప్రధాని నరేంద్ర మోదీ సరదాగా సంభాషించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ప్రధాన వేదికపై ఆయన కూర్చున్నారు. అయితే అందరినీ పలకరించుకుంటూ నమస్కరిస్తూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కల్యాణ్ వద్ద కాసేపు ఆగిపోయారు.

దీక్షా వస్త్రాల్లో ఉన్న ...
ఆయనతో జోకులేశారు. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక వస్త్రధారణతో రావడంతో పాటు ఆయన దీక్షలో ఉన్నట్లు కనిపించారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ఈ దీక్ష తీసుకున్నట్లు తెలిసింది. అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మహాకుంభమేళాలో కూడా అదే వస్త్రధారణతో వెళ్లారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా అలాగే రావడంతో అందరిలో ప్రత్యేక లుక్ లో కనిపించారు. దీంతో ఆయనతో మోదీ నవ్వుతూ పలకరించి ఏదో అనగా అక్కడ ఉన్న అందరూ పగలబడి నవ్వారు. పవన్ కల్యాణ్ కూడా నవ్వాపుకోలేకపోయారు.


Tags:    

Similar News