Mahanadu : మహానాడులో లోకేశ్ నామస్మరణ.. అందరినోటా అదే మాట

కడప మహానాడులో నారా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మహానాడు వేదికగా ఆరు శాసనాలను ప్రకటించారు

Update: 2025-05-27 08:03 GMT

కడప మహానాడులో నారా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మహానాడు వేదికగా ఆరు శాసనాలను ప్రకటించారు. నారా లోకేశ్ ప్రసంగం కూడా కార్యకర్తలే తనకు అధినేతలు ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకే పెద్దపీట వేస్తుందని కూడా మహానాడు వేదికగా లోకేశ్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు నేతలపైన ఆధారపడవద్దని జనంలోకి వెళ్లాలని, అప్పుడే వెతుక్కుంటూ తెలుగుదేశం పార్టీ మీ వెంట వస్తుందని నారా లోకేశ్ అసలు సీక్రెట్ చెప్పుకొచ్చారు. కార్యకర్తల సంక్షేమానికి తమ పార్టీ ఎప్పడూ పాటుపడుతూనే ఉంటుందని, అందుకే దేశంలో ఏ పార్టీకి లేనంతగా కోటి సభ్యత్వాలు ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయని లోకేశ్ అన్నారు.

కార్యకర్తలే అధినేతలంటూ...
ఇక నారా లోకేశ్ ఈ మహనాడులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికవుతారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఉన్నత స్థాయిలో ఉన్న నేతల నుంచి దిగువ స్థాయి నేతల వరకూ నారా లోకేశ్ దృష్టిలో పడటానికి ప్రయత్నించేందుకు ఎక్కువ పాటుపడుతున్నట్లు కనిపించింది. నారా లోకేశ్ ప్రసంగానికి మంచి రెస్పాన్స్ రావడం బట్టి లోకేశ్ నాయకత్వాన్ని తాము సమర్థిస్తున్నామని చప్పట్లతో చెప్పకనే నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు చెప్పేశారు. ప్రధానంగా తనకు పుంగనూరులో అంజిరెడ్డి తాత, మంజుల అక్క, పల్నాడులో తోట చంద్రయ్య తనకు స్పూర్తి అంటూ చెప్పుకొచ్చిన లోకేశ్ వారిని ఆదర్శంగా తీసుకుని తాను ముందుకు వెళతానని కూడా చెప్పుకొచ్చి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ మహానాడు ఎంతో ప్రత్యేకం...
నారా లోకేశ్ కు ఈ మహానాడు ఎంతో ప్రత్యేకం. ఇప్పటి వరకూ ఎన్ని మహానాడులు జరిగినప్పటికీ గత మహానాడులో పార్టీ అధికారంలో లేదు. అయినా లోకేశ్ అప్పుడు తన ప్రసంగంతో కొంత కార్యకర్తల్లో ఉత్సాహం నింపినా, కడప జిల్లాలో జరిగే మహానాడు మాత్రం తనలోని నాయకుడిని కార్యకర్తలకు చూపించిన తర్వాత మాత్రమే ఆయన లీడర్ గా ఎదిగానని చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన మంగళగిరి నుంచి మాత్రమే పోటీ చేసి తిరిగి గెలవడంతో పాటు యువగళం పాదయాత్రతో కార్యకర్తలను, నేతలను ఏకం చేయడంలో లోకేశ్ సక్సెస్ అయిన తీరు కూడా పార్టీలో ఆయన ఎదుగుదలకు కారణమయిందని చెప్పాలి. అందుకే లోకేశ్ వెనక ఎవరు ఉన్నారన్నది పక్కన పెడితే ఆయన ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు, అందుబాటులో ఉండే సమయం వంటివి అదనపు బలాలుగా మారాయని చెప్పకతప్పదు.


Tags:    

Similar News