Breaking : బొత్సనువిశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఢీకొట్టేది ఈయనేనట
విశాఖ ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్పీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారయినట్లు తెలిసింది
baira dilip chakravarthy, finalized, mlc nda candidate, visakha
విశాఖ ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్పీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారయింది. ఆయన పేరును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. పలువురి పేర్లను పరిశీలించిన చంద్రబాబు చివరకు బైరా దిలీప్ చక్రవర్తి పేరుకు ఓకే చేశారని తెలిసింది. బైరా దిలీప్ చక్రవర్తి అత్యంత సంపన్నుడు. ఆయన గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా టీడీపీ తరుపు నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించారు.
కోటీశ్వరుడిగా...
అయితే అనకాపల్లి స్థానం కూటమితో పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లిపోవడంతో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. వైసీపీ బలమైన బొత్స సత్యనారాయణను బరిలోకి దింపింది. ఆయనను అన్ని రకాలుగా ఎదుర్కొనాలంటే కోట్లకు పడగలెత్తిన బైరా దిలీప్ చక్రవర్తి అయితే కరెక్ట్ క్యాండిడేట్ అని చంద్రబాబు భావించి ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది.