కార్యకర్త టీ స్టాల్ కు వెళ్లిన బాలకృష్ణ

హిందూపురంలో రెండు రోజుల పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తున్నారు.

Update: 2026-02-19 07:34 GMT

హిందూపురంలో రెండు రోజుల పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొననున్నారు. శ్రీకంఠాపురానికి చెందిన టీడీపీ మహిళ కార్యకర్త సంధ్య ఆహ్వానం మేరకు టీ స్టాల్ కు వెళ్లారు. గతంలో ఆమె తాను టీ స్టాల్ ను త్వరలో ప్రారంభిస్తున్నానని వచ్చి మీరు టీ తీగాలని ఆమె బాలకృష్ణను కోరారు.

రెండు రోజుల పర్యటనలో...
టీడీపీ కార్యకర్త ఆహ్వానం మేరకు నందమూరి బాలకృష్ణ అక్కడకు వెళ్లారు. గ్రీన్ టీ తాగారు. దీంతో మహిళ కార్యకర్త సంధ్య సంతోషం వ్యక్తం చేశారు. బాలకృష్ణ స్వయంగా తన టీ స్టాల్ కు వచ్చి టీ తాగడం తాను జన్మలో మరిచిపోనని అన్నారు. మరొకవైపు హంద్రీనీవా జలాలకు జలహారతితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొననున్నారు.












Tags:    

Similar News