మలేసియాలో మంత్రి నారాయణ

మలేసియాలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది.

Update: 2025-08-03 07:03 GMT

మలేసియాలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది. పుత్రజయ సర్కిల్, వెట్ ల్యాండ్ పార్కును మంత్రి నారాయణ పరిశీలించారు. సింగపూర్ లో పర్యటించి వివిధ అంశాలపై అధ్యయనం చేసిన మంత్రి నారాయణ తర్వాత మలేసియా చేరుకున్నార. అక్కడ కూడా వ్యర్థ పదార్థాలను ఏ విధంగా వినియోగిస్తున్నారు? పార్కుల వంటి వాటిపై అధ్యయనం చేస్తున్నారు.

అమరావతిలో...
138 హెక్టార్లలో ప్రపంచ ప్రసిద్ధ వృక్ష జాతులతో నిర్మించిన వెట్ ల్యాండ్ పార్కు ను సందర్శించిన మంత్రి నారాయణ మలేసియా టూరిజంలో కీలకంగా ఉన్న పార్కు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో భారీ పార్కుల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడంతో పుత్రజయలో మలేసియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో నారాయణ సమావేశం నిర్వహించారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.


Tags:    

Similar News