అమరావతికి ప్రజల సొమ్ము పై సా ఖర్చు చేయం : మంత్రి నారాయణ

అమరావతి రాజధాని పనులకు సంబంధించి ప్రజల సొమ్మును ఖర్చు చేయడం లేదని మంత్రి నారాయణ తెలిపారు

Update: 2025-03-11 11:55 GMT

అమరావతి రాజధాని పనులకు సంబంధించి ప్రజల సొమ్మును ఖర్చు చేయడం లేదని మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ లో కేటాయించిన ఆరువేల కోట్ల రూపాయలు సీఆర్డీఏ కోసమేనని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ప్రజల సొమ్ము ఖర్చుచేయబోమని తెలిపారు. 31 వేల కోట్ల రూపాయలతో భవనాలను నిర్మించిన తర్వాత భూమి విలువ పెరుగుతుందని, తర్వాత భూములను వేలం వేసి అప్పుల తీరుస్తామని తెలిపారు.

ఎనిమిది నెలల నుంచి...
గత ఎనిమిది నెలల నుంచి రాజధాని అమరావతి పనులకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కారణంగా వరద నీరు చేరిందని, దీంతో ఐఐటీ మద్రాస్ నిపుణులను పిలిపించి అధ్యయనం చేయించామన్న మంత్రి నారాయణ, తర్వాత కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో వాటిని తొలగించుకున్నామని చెప్పారు. తర్వాత నెలన్నర కాలం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని త్వరలోనే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి నారాయణ తెలిపారు.


Tags:    

Similar News