మంత్రి బొత్సకు నెలరోజులు ఆసుపత్రిలోనే విశ్రాంతి
మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు
botsa satyanarayana
మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. నెల రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. మంత్రి బొత్స సత్యనారాయణ శృంగవరపుకోటలోని వైసీపీ బస్సు యాత్రలో స్వల్ప అస్వస్థతకు గురికాగా వెంటనే సన్నిహితులు హైదరాబాద్ కు తరలించారు.
ఓపెన్ హార్ట్ సర్జరీ...
అక్కడ బొత్స సత్యనారాయణను పరీక్షించిన వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు. నిన్న రాత్రి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయిందని వైద్యులు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకూ ఆపరేషన్ జరిగింది. నెల రోజుల వరకూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు.