మూడు రాజధానుల ఏర్పాటు ఖాయం

మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

Update: 2022-03-13 12:55 GMT

మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మరో యాభై ఏళ్ల తర్వాత అయినా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తుందని, ఒక్క రాజధానిని పెట్టుకుని అప్పుడేంచేస్తారని ఆయన ప్రశ్నించారు. అందుకే భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చారని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

కర్ణాటక, ఝార్ఖండ్ కూడా....
రాజధాని ఆగిపోయిందని ప్రభుత్వంపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. యాభై ఏళ్లు పెట్టుబడి పెట్టిన హైదరాబాద్ ఏమయిందో మనం చూశాం కదా? అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. చివరకు కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాలు కూడా మూడు రాజదానులు పెట్టే యోచన చేస్తున్నాయని ఆయన తెలిపారు.


Tags:    

Similar News