జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది: ఆనం రామనారాయణరెడ్డి
జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు
జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. జగన్ దమ్ముంటే గెలిచిన పదకొండు స్థానాలకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆనం రామనారాయణరెడ్డి కోరారు. జగన్ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్న ఆనం రామనారాయణరెడ్డి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. జగన్ తన హయాంలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారు.
రాయలసీమకు అన్యాయమే...
జగన్ తన ఐదేళ్ల అధికారంలో రాయలసీమకు చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. కనీసం హంద్రీనీవా పనులను కూడా పూర్తి చేయాలేదన్న విషయం గుర్తు చేయాలా? అని నిలదీశారు. జగన్ మాటలు చూస్తుంటే మరొకసారి అధికారంలోకి రావడానికి అడ్డమైన అబద్ధాలు ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమంలోనూ, అటు అభివృద్ధిలోనూ పరుగులు పెడుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నాడంటూ ఆయన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.