బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
ఈ నెలాఖరులో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతవరణ శాఖ వెల్లడించింది
ఈ నెలాఖరులో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతవరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈనెల 25 నుంచి 28 వరకు తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీ రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటగా, నెలాఖరుకు గరిష్ఠంగా 40 డిగ్రీలకు చేరే సూచనలున్నాయని అధికారులు హెచ్చరించారు.
అల్పపీడనం ప్రభావంతో...
అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ వానలు కురిసే అవకాశముందని, అకాల వర్షాలు కురుస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగానే వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నెలాఖరులో కురిసే వానలు స్వల్పంగానే పడవచ్చని అంచనా వేస్తుంది.