ఏవండీ .. జాగ్రత్త... వాగులు దాటేటప్పుడు

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

Update: 2022-11-03 06:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కృష్ణా, కోనసీమ, ప్రకాశం, అనకాపల్లి, ఏలూరు, ఉభయ గోదావరి, కాకినాడ జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని పేర్కొంది.

నదులు పొంగి...
దీంతో పాటు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఇప్పటికే ఇక్కడ కురిసిన వర్షాలతో నదులు, వాగుల ప్రవహిస్తున్నాయి. వాగులు దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు కోరుతున్నారు.


Tags:    

Similar News