Ys Jagan : 25న భీమిలీకి జగన్
ఈ నెల 25వ తేదీన భీమిలీలో వైఎస్సార్ కాంగ్రెస్ బహిరంగ సభ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు
ys jaganadudam andhra
ఈ నెల 25వ తేదీన భీమిలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉత్తరాంధ్ర నుంచే రానున్న ఎన్నికలకు శంఖారావాన్ని జగన్ పూరించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ సీనియ్ నేత వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
క్యాడర్ తో సమావేశం
ఈ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మంది కార్యకర్తలను రప్పించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో జగన్ సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను దిశానిర్దేశం చేస్తారన్నారు. జోన్ల వారీగా క్యాడర్ ను కలిసి వారికి పార్టీ అభ్యర్థులను ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించనున్నారు. మొత్తం ఐదు ప్రాంతీయ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించామని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు.